: బెంగళూరుపై రాజస్థాన్ విజయం


ఐపీఎల్ 7 లో బెంగళూరు జట్టు చేసిన అత్యల్ప స్కోరును రాజస్థాన్ జట్టు ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా ఛేదించింది. 15 ఓవర్లలో కేవలం 70 పరుగులు మాత్రమే చేసిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఏ దశలోనూ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు పోటీ ఇవ్వలేకపోయింది. బౌలింగ్ లో తంబే, రిచర్డ్ సన్ నిప్పులు చెరిగి ఆర్సీబీని 70 పరుగులకే కట్టడి చేస్తే, రహానే(23), వాట్సన్(24) విజయానికి బాటలు వేశారు. దీంతో కేవలం 13 ఓవర్లలోనే రాజస్థాన్ రాయల్స్ 71 పరుగులు సాధించి విజయం సాధించింది.

  • Loading...

More Telugu News