: డాక్టర్ రెడ్డీస్ ఛైర్మన్ గా జీవీ ప్రసాద్
ప్రఖ్యాత `డాక్టర్ రెడ్డీస్` సంస్థకు కొత్త ఛైర్మన్ గా జీవీ ప్రసాద్ నియమితులయ్యారు. ఇప్పటివరకూ ఈ సంస్థకు ప్రసాద్ వైస్ ఛైర్మన్ గా, సీఈఓగా సేవలందిస్తున్నారు. ఈ సంస్థ ఛైర్మన్ అంజిరెడ్డి ఇటీవలే దివంగతులైన నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. అంజిరెడ్డికి ప్రసాద్ అల్లుడు. ఇక వైస్ ఛైర్మన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా అంజిరెడ్డి కుమారుడు సతీష్ రెడ్డి నియమితులయ్యారు. నామినేషన్, గవర్నెన్స్, కంపెన్స్ సెషన్ కమిటీ సిఫార్సు మేరకు ఈ నియామకాలు చేపట్టారు.