: డబ్బున్నవాళ్ల కోసమే జగన్ పార్టీ విద్యుత్ పోరాటం : బొత్స
విద్యుత్ భారం పేదలపై పడనివ్వబోమని పదేపదే చెబుతోన్నా వైఎస్ఆర్ పార్టీ ఎందుకు రాద్దాంతం చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. జగన్ పార్టీ అంతరంగం చూస్తుంటే ధనికులతో కుమ్మక్కై వారిపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా ప్రయత్నిస్తోందని అర్థమవుతుందని అన్నారు. విద్యుత్ సంక్షోభం తలెత్తి రాష్ట్రం అంధకారం కావాలన్నదే జగన్ పార్టీ అభిమతమని ఆయన వ్యాఖ్యానించారు. అవసరమనుకుంటే విద్యుత్ చార్జీల పెంపు తదితర అంశాలను పార్టీ వేదికపై చర్చిస్తామని వెల్లడించారు.