: 43 సెకండ్లలో 95వ అంతస్తుకు తీసుకెళ్లే ఎలివేటర్
ఇది aలాంటి ఇలాంటి ఎలివేటర్ కాదు. 43 సెకండ్లలోనే 95వ అంతస్తుకు తీసుకెళుతుంది. అన్ని అంతస్తులు ఏ భవనంలో ఉంటాయి గనుక.. అని అనుకుంటున్నారా? దక్షిణ చైనాలోని గ్యాంగ్జులోని 111 అంతస్తుల ఆకాశహార్మ్యం లాంటి భవనంలో జపాన్ కు చెందిన హిటాచీ రెండు ఎలివేటర్లను నిర్మిస్తోంది. ఇవి గంటకు 72 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. దీంతో ప్రపంచంలోనే అత్యంత వేగంతో ప్రయాణించే ఎలివేటర్లుగా ఇవి గుర్తింపు సొంతం చేసుకోనున్నాయి. ప్రస్తుతం తైపేలోని వరల్డ్ ఫైనాన్షియల్ సెంటర్ లో ఉన్న ఎలివేటర్ ప్రపంచంలోనే వేగవంతమైనదిగా రికార్డుల్లో ఉంది. దీని వేగం గంటకు 60 కిలోమీటర్లు.