: రూ.3 తగ్గిన రాయితీలేని గ్యాస్ సిలిండర్ ధర


అంతర్జాతీయంగా ఆయిల్ ధరల పతనంతో రాయితీలేని ఒక్కో గ్యాస్ సిలిండర్ పై రూ.3 మేర ధర తగ్గింది. దీని ప్రకారం 14.2 కేజీల ఎల్ పీజీ సిలిండర్ ను ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ధరల ప్రకారం వినియోగదారులు రూ.901కు కొనుగోలు చేయవచ్చు. తగ్గించిన రేటు సోమవారం నుంచే అమలులోకి రానుంది.

గతంలో రాయితీ సిలిండర్లను
 సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి ఆరే ఇస్తామన్న ప్రభుత్వం, జనవరి నుంచి తొమ్మిదికి పెంచింది. ఇప్పుడు ఆయిల్ ధరలు దారుణంగా పతనం కావడంతో మార్చిలో రూ.904 ఉన్న సిలిండర్ ధర రూ.901కు తగ్గించాల్సి వచ్చింది.  అయితే ఒక్కో ఎల్ పీజీ సిలిండర్ ధర ముంబైలో  రూ.912 వుంటే కోల్ కతాలో రూ.919 వుంది.

  • Loading...

More Telugu News