: కష్టపడే తత్వం సీమాంధ్రుల సొంతం: చిరంజీవి
సీమాంధ్రులది కష్టపడే తత్వమని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. కృష్ణా జిల్లాలో ప్రచారం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన వల్ల మంచే జరిగిందని, రెక్కలు ముక్కలు చేసుకునే ప్రజలు ఇక్కడ ఉన్నారని అన్నారు. సీమాంధ్రుల్లో అక్రమంగా సంపాదించేద్దామనే ఆలోచన తక్కువ అని, అందరూ కష్టపడతారని తెలిపారు. రాష్ట్రాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే అవకాశం మనకు దక్కినందుకు ఆనందంగా ఉందని చిరంజీవి తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రులే ఎక్కువ లాభపడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.