: మోడీని 'హిట్లర్' అన్న చిరుపై కోడిగుడ్లు విసిరిన కమలం మద్దతుదారులు


బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని 'హిట్లర్', 'క్రూరుడు' అన్న కేంద్ర మంత్రి, ఏపీ ప్రచార కమిటీ ఛైర్మన్ చిరంజీవిపై బీజేపీ మద్దతుదారులు కోడిగుడ్లు విసిరారు. మచిలీపట్నంలో నిన్న(శుక్రవారం) ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న చిరు కోనేరు సెంటర్ లో మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగింది. దాంతో, వెంటనే ర్యాలీని కొంతసేపు ఆపివేశారు. కమలం మద్దతుదారులను పోలీసులు చెదరగొట్టి, కొంతమందిని పక్కకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News