: ప్రచారంలో కీలక నేతల కామెంట్లు
ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో ... నేతలు తమ ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు విమర్శలకు పదును పెడుతున్నారు. ఈ నేపథ్యంలో, కొంతమంది నేతల సెటైర్లు, కామెంట్లు చూద్దాం.
* దిగ్విజయ్ సింగ్ - కేసీఆర్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరికీ తెలుసు.
* కేసీఆర్ - బాబూ పిచ్చికూతలు వద్దు. నేను తలచుకుంటే బయటకు అడుగుపెట్టగలవా? అధికారంలోకి వస్తే నిన్ను జైల్లో పెడతా.
* చంద్రబాబు - సైకిల్ స్పీడును ఎవరూ తట్టుకోలేరు. ఎవరైనా అడ్డొస్తే తొక్కించి దూసుకెళ్తాం. కేసీఆర్! పిచ్చిపిచ్చిగా మాట్లాడకు.
* చిరంజీవి - రాష్ట్ర విభజన జరగడమే మంచిదయింది. ఓ ద్రోహి పీడ వదిలింది.
* జైరాం రమేష్ - కేసీఆర్ కంటే పెద్ద సెటిలర్ తెలంగాణలో ఎవరూ లేరు.
* మోడీ - దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అందుకే దేవుడు నన్ను ఎంచుకున్నాడు.
* పొన్నాల - లేనిపోని అభాండాలు వేస్తూ నన్ను గిచ్చితే... నేను రెచ్చిపోతా.