: కొత్తపల్లి సుబ్బరాయుడుకు తీవ్ర అస్వస్థత


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొత్తపల్లి సుబ్బరాయుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన... గుండె, శ్వాసకోశ సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నారు. గత ఏడాది ఆయన బైపాస్ సర్జరీ కూడా చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన తరపున ఆయన కుమారుడు నాని, సోదరుడు జానకీరామ్ (మాజీ ఎమ్మెల్యే) ప్రచారం నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News