: గుజరాత్ లో కరెంటు పోదు...మనకి కరెంటు రాదు: వెంకయ్యనాయుడు


గుజరాత్ లో కరెంటు పోదు, మన రాష్ట్రంలో కరెంటు రాదని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు చమత్కరించారు. రాజమండ్రిలోని క్వారీ ఏరియాలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఉన్న పార్టీలన్నీ ప్రధాని అభ్యర్థుల పేరు చెప్పమంటే కొత్త పెళ్లి కూతుళ్లులా సిగ్గుపడుతూ నసుగుతున్నాయని, బీజేపీ మాత్రమే నరేంద్ర మోడీ పేరు ధైర్యంగా ప్రకటించిందని అన్నారు. గ్యాస్ సిలెండర్ల సంఖ్య తగ్గించి, ధరలు పెంచి మహిళలను ఉసురుపెడుతున్నాయని ఆయన మండిపడ్డారు. దేశంలో మోడీ, రాష్ట్రం లో చంద్రబాబు అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. మోడీ ప్రధాని అయితే సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి పదేళ్లకు పెంచుతామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News