: ‘లెజెండ్’ సినిమాలో ఆ సన్నివేశాలను తొలగించండి: ఈసీ ఆదేశం
సినీ హీరో, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమాలో నాలుగు సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఎన్నికల సంఘం గుర్తించింది. సినిమాలోని ఆ సన్నివేశాలను తొలగించాలంటూ నిర్మాతను ఆదేశించింది. లెజెండ్ సినిమా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ వైయస్సార్ సీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం విదితమే. దీంతో ఎన్నికల సంఘం అధికారులు నిన్న హైదరాబాదులో ఈ సినిమాను చూసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.