: తెలంగాణకు మహిళ ముఖ్యమంత్రి కావాలి: రాహుల్ గాంధీ
తెలంగాణ రాష్ట్రానికి ఒక మహిళ ముఖ్యమంత్రి కావాలన్నది తన కోరిక అని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బాంబు పేల్చారు. వరంగల్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పనే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు. పార్టీలో మహిళల భాగస్వామ్యం పెంచుతామని తెలిపారు. రాష్ట్రాన్ని పరిపాలించాలంటే దూరదృష్టి, తపన, పరిణతి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. తనను ప్రజల మనిషిగా గుర్తించాలని ఆయన సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాను ముందుండి కృషి చేస్తానని ఆయన తెలిపారు.