: ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ ప్రారంభం
ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో కేంద్ర కేబినెట్ భేటీ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన కొనసాగింపుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. రాష్ట్ర అసెంబ్లీ రద్దు అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. అంతేగాక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తారు.