: ములాయంకు ఈసీ వార్నింగ్
సమాజ్ వాదీ పార్టీకే ఓటు వేయాలంటూ టీచర్లను బెదిరించిన ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు ఎన్నికల సంఘం హెచ్చరిక జారీ చేసింది. ఇక ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని రోజుల కిందట బలందేశ్వలో నిర్వహించిన ర్యాలీలో ములాయం మాట్లాడుతూ, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా పని చేసే వారు తమ పార్టీకి ఓటేస్తే, వారిని శాశ్వత ఉద్యోగులను చేస్తామన్నారు. ఈ మేరకు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ ఆయన మాట్లాడారని ఈసీకి ఫిర్యాదు అందడంతో నోటీసు కూడా పంపింది.