: టీడీపీ నేతపై కాంగ్రెస్ కార్యకర్తల రాళ్లదాడి


రంగారెడ్డి జిల్లాలో టీడీపీ ఎన్నికల ప్రచారం ఘర్షణకు దారితీసింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల మండలంలో టీడీపీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రసంగిస్తుండగా, అదే గ్రామానికి చెందిన కొంత మంది కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు గాయాలపాలవ్వగా, నాలుగు కార్లు ధ్వంసమయ్యాయి. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి చక్కదిద్దారు. నిందితులను గుర్తించి కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News