: సీబీఐ కేసులు కాంగ్రెస్ కుట్రే: కేసీఆర్


తన ఆస్తులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలంటూ ఈ రోజు సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశించడంపై టీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు స్పందించారు. ఈ మేరకు మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, సీబీఐ కేసులు అన్నీ కాంగ్రెస్ కుట్రేనని అన్నారు. కేసులకు ఏమాత్రం భయపడేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి పిట్ట బెదిరింపులకు తాను లొంగనన్న కేసీఆర్, తాను నిప్పులా బతికానని, సీబీఐ కేసులు ఏమీ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. అయినా సీబీఐ కేసులను ఆహ్వానిస్తున్నానని చెప్పుకొచ్చారు. 'స్వీయ రాజకీయ అస్తిత్వమే మనకు శ్రీరామ రక్ష' అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే తెలంగాణను సర్వనాశనం చేస్తారన్నారు.

  • Loading...

More Telugu News