: విమానం హైజాక్ కాలేదు... మందుబాబు దెబ్బకు ల్యాండయింది


ఆకాశంలో ప్రయాణిస్తుండగా... విమానంలో మద్యం తాగిన ప్రయాణికుడు నానా రభస చేశాడు. అంతటితో ఆగక... కాక్ పిట్ లోకి దూరేందుకు యత్నించడంతో ఆ విమానాన్ని ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో ఉన్న డెన్ పసార్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా దింపేశారు. ఆ ఘటన ఆస్ట్రేలియాకు చెందిన విమానంలో చోటు చేసుకుంది.

ముందుగా బ్రిస్బేన్ నుంచి బాలి వెళ్లాల్సిన ఆ విమానాన్ని హైజాక్ చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే, ఈ మందుబాబు చేసిన రభస వల్లే అని తర్వాత తేలింది. మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడు విమానం కాక్ పిట్ లోని వెళ్లేందుకు యత్నించాడు. దీనితో అప్రమత్తమైన పైలట్ ఆ సమాచారాన్ని ఏటీసీకి అందించడంతో వెంటనే విమానాన్ని బాలి ద్వీపంలో దించేశారు. ల్యాండ్ అయిన వెంటనే ఆ ప్రయాణికుడిని డెన్ పసార్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News