: వస్త్రమంత పలుచనైన సెల్ ఫోన్లు
వంటిపై వేసుకున్న టీ షర్ట్ మోగుతుంటే? చేతిలో ఉన్న కర్చీఫ్ నుంచి రింగ్ టోన్ వినపడుతుంటే? ఒక్కసారి ఊహించుకోండి. భవిష్యత్తులో అలాంటి సెల్ ఫోన్లే రాబోతున్నాయి. వస్త్రమంత పలుచగా ఉండే సెల్ ఫోన్లను తయారు చేసేందుకు వీలుగా ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన సాగిస్తున్నారు. ఇవి సాధారణ సెల్ ఫోన్లకు ఏ మాత్రం తీసిపోకుండా సమర్థవంతంగా ఉండనున్నాయి. స్పేసర్ టెక్నాలజీ సాయంతో వీటిని రూపొందించేందుకు వారు పరిశోధన చేస్తున్నారు.