: కాల్పుల విరమణ ఉల్లంఘించిన పాక్
దాయాది దేశం పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. తాజాగా ఈ ఉదయం జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి పూంచ్ జిల్లా దోడా బెటాలియన్ ప్రాంతంలో ఆ దేశ సైన్యం కాల్పులు జరిపింది. వెంటనే భారత జవాన్లు సమర్థవంతంగా కాల్పులను తిప్పికొట్టినట్లు సీనియర్ ఆర్మీ అధికారి తెలిపారు.