: టాటా డొకోమో నుంచి వెళ్లిపోనున్న డొకోమో
టాటా డొకోమో జాయింట్ వెంచర్ నుంచి జపాన్ కు చెందిన ఎన్ టీటీ డొకోమో వైదొలగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఎన్ టీటీ డొకోమో స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. టాటా టెలిసర్వీసెస్ లాభాలబాట పట్టకపోతే జాయింట్ వెంచర్ లో తమకున్న 26.5 శాతం వాటాను జూన్ నాటికి విక్రయిస్తామని స్పష్టం చేసింది. ఈ వాటా విలువ 7,250కోట్లుగా ఉంటుందని అంచనా. 2009లో జాయింట్ వెంచర్ లో డొకోమో పెట్టిన పెట్టుబడిన విలువ ప్రస్తుతం సగానికి పడిపోయింది. అప్పుడు సుమారు 15వేల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టింది. ఒప్పందం ప్రకారం తమ వాటాను టాటాలకే విక్రయిస్తామని డొకోమో ప్రకటించింది.