: నేను కిడ్నాప్ కాలేదు: శోభానాగిరెడ్డి డ్రైవర్
శోభానాగిరెడ్డి కారు డ్రైవర్ అదృశ్యం మిస్టరీ వీడింది. శోభానాగిరెడ్డి ప్రమాద ఘటనకు కారణమైన నాగిరెడ్డి సొంత ఊరు కోటకందూరులోని తన నివాసానికి వచ్చినట్టు తెలిపాడు. వైద్యుల అనుమతితోనే ఆయన తన నివాసానికి చేరుకున్నట్టు స్పష్టం చేశారు. కన్నతల్లి కంటే మిన్నగా చూసుకున్న వ్యక్తిని కొల్పోయానని తాను ఆవేదన చెందుతుంటే, పారిపోయానంటూ టీవీల్లో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.