: 117 సార్లు గర్ల్ ఫ్రెండ్ ను కొట్టిన టెక్ సీఈవో


అమెరికాలో రేడియం వన్ అనే టెక్నాలజీ కంపెనీకి సీఈవోగా ఉన్న భారత సంతతి వ్యక్తి, 31ఏళ్ల గుర్ బక్ష్ సింగ్ చేసిన నేరాన్ని అంగీకరించాడు. గర్ల్ ఫ్రెండ్ ను 117 సార్లు తన్నినట్లు అంగీకరించాడు. దీంతో శాన్ ఫ్రాన్సిస్కో సుపీరియర్ కోర్టు అతడికి మూడేళ్ల ప్రొబేషనరీ శిక్ష విధించింది. అలాగే, 25 గంటలపాటు సామాజిక సేవ చేయాలని కూడా ఆదేశించింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్ మెంట్లో గర్లఫ్రెండ్ ను 30 నిమిషాల వ్యవధిలో 117 సార్లు గుర్ భక్ష్ కొట్టినట్లు ఆధారంగా వీడియో ఫుటేజీని దర్యాప్తు అధికారులు కోర్టుకు సమర్పించారు. లాస్ వెగాస్ పర్యటనలో తన గర్ల్ ఫ్రెండ్ వేరే వ్యక్తికి దగ్గరై తనను మోసం చేసిందన్న మంటతో గుర్ భక్ష్ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. చిత్రమేమిటంటే, గతంలో గుర్ భక్ష్ ను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా అమెరికాకు చెందిన ఎక్స్ ట్రా టీవీ ప్రకటించడం కొసమెరుపు.

  • Loading...

More Telugu News