: హైదరాబాదులో రేపు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ రేపు హైదరాబాదుకు రానున్నారు. హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో రేపు సాయంత్రం నాలుగు గంటలకు జరిగే బహిరంగ సభలో రాహుల్ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభ ఏర్పాట్లను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ పర్యవేక్షిస్తున్నారు.