: ఫ్రశాంతంగా ముగిసిన ఆరో విడత పోలింగ్
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ జరిగిన ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి సహా 117 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. అయితే, సాయంత్రం 5 గంటల సమయానికి క్యూలో ఉన్న వారికి మాత్రం ఓటు వేసే అవకాశం కల్పించడంతో కొన్ని చోట్ల పోలింగ్ ఇంకా కొనసాగుతోంది. పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఛత్తీస్ గఢ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, పుదుచ్చేరి మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్ లో ఇవాళ పోలింగ్ జరిగింది.