: కేసీఆర్ ను ప్రజలు రాళ్లతో కొట్టే రోజులు దగ్గరపడ్డాయి: గుత్తా
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పిస్తూ, జనాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ గురించి మాట్లాడకుండా... ఫాంహౌస్ లో పడుకున్న ఘనత కేసీఆర్ ది అని విమర్శించారు. సంస్కారం లేని కేసీఆర్ కనీసం సరిగ్గా మాట్లాడటమైనా నేర్చుకోవాలని సూచించారు. కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు రాళ్లతో కొట్టే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.