: రెడ్ కార్నర్ నోటీసుపై కేవీపీయే స్పందిస్తారు: కేంద్రమంత్రి ఆనంద్ శర్మ
టైటానియం కుంభకోణంలో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావును అరెస్టు చేసేందుకు అమెరికా దర్యాప్తు సంస్థ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆయనే స్పందిస్తారని కేంద్రమంత్రి ఆనంద్ శర్మ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలో మాట్లాడిన ఆయన, దోషి అని తేలితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని చెప్పారు.