: సీఈసీ ఆదేశాల మేరకే ఆళ్లగడ్డ ఎన్నిక: భన్వర్ లాల్


ఆళ్లగడ్డ ఎన్నిక నిర్వహణపై కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) తుది నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్ లాల్ చెప్పారు. సీఈసీ ఆదేశాల మేరకే అక్కడ ఎన్నికను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శోభానాగిరెడ్డి మృతి విషయాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్తామని భన్వర్ లాల్ చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో పాటు... ప్రధానమైన పార్టీ నుంచి ఆమె పోటీలో ఉన్న విషయాన్ని ఎన్నికల సంఘానికి నివేదిస్తామని ఆయన అన్నారు.

శోభానాగిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆళ్లగడ్డలో నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటికి వెళుతూ రోడ్డుప్రమాదంలో తీవ్రగాయాల పాలై మరణించిన విషయం విదితమే.

  • Loading...

More Telugu News