: ముగిసిన శివరామకృష్ణన్ కమిటీ భేటీ.. మే 2న మళ్లీ
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన శివరామకృష్ణన్ కమిటీ భేటీ ముగిసింది. ఈ భేటీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏకే మహంతి కూడా హాజరయ్యారు. మే 2న ఏపీ భవన్ లో ఈ కమిటీ తదుపరి భేటీ జరగనుంది. సమావేశం అనంతరం కమిటీ అధ్యక్షుడు శివరామకృష్ణన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికలో ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. నీరు, భూమి లభ్యత, వాతావరణంపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల తర్వాత కమిటీ ఏపీలో పర్యటించి రాజధాని ప్రత్యామ్నాయాలపై తెలుసుకుంటుందని పేర్కొన్నారు.