: వారణాసిలో నామినేషన్ వేసిన మోడీ


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వారణాసిలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇవాళ ఉదయం వారణాసి చేరుకున్న మోడీ ముందుగా మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా బయల్దేరి వెళ్లి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News