: ప్రతి వాళ్లూ మానవత్వం పెంచుకోవాలి : జస్టిస్ చలమేశ్వర్
ప్రతి ఒక్కరు మానవతా దృక్పదంతో ఆలోచించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదిగాక పేద విద్యార్థుల్ని ఆదుకునే ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు. హైదరాబాదులోని రవీంద్రభారతి లో జరిగిన హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీసీ రెడ్డి ట్రస్టు 13వ వార్షిక అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా న్యాయశాస్త్రం, మెడిసిన్, ఇంజనీరింగ్, క్రీడలు, సాంస్కృతిక విభాగాల్లో రాణిస్తోన్న విద్యార్థినులకు జస్టిస్ చలమేశ్వర్, లోకాయుక్త జస్టిస్ సుభాషణ్ రెడ్డి చేతుల మీదుగా పీసీ రెడ్డి అవార్డుల ప్రదానం జరిగింది.