: రాయలసీమలో పీఆర్పీ తరపున గెలిచిన ఏకైక నేత శోభానాగిరెడ్డి
టీడీపీ, పీఆర్పీ, వైకాపాలలో క్రియాశీలక నేతగా దివంగత శోభానాగిరెడ్డి పేరుతెచ్చుకున్నారు. చిరంజీవి పీఆర్పీ స్థాపించిన తర్వాత భూమా దంపతులు ఆ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో పీఆర్పీ రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాల్లోనూ పోటీ చేసింది. అయితే, ఆ ఎన్నికల్లో రాయలసీమలో పీఆర్పీ తరపున ఒక్క శోభానాగిరెడ్డి మాత్రమే గెలుపొందారు. మిగిలిన అభ్యర్థులు ఎవరూ గెలుపొందలేక పోయారు. రాయలసీమలో పీఆర్పీకి ఏమాత్రం పట్టులేకపోయినప్పటికీ... ఎన్నికల్లో గెలిచి తన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటారు శోభ.