: పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కన్నా... వారు వారసులే: సుప్రీంకోర్టు


పెళ్లి చేసుకోకుండా సహజీవనం ద్వారా పిల్లల్ని కంటే వారు చట్టబద్ధ వారసులేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలంటూ న్యాయవాది ఉదయ్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ బీఎస్ చౌహాన్, జస్టిస్ జే చలమేశ్వర్ తో కూడిన ధర్మాసనం విచారించింది. పెళ్లి చేసుకోకపోయినా, కలసి జీవించి, పిల్లలను కంటే వారిని వివాహితులుగానే భావించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. వారి సంతానాన్ని అక్రమం అని చెప్పడానికి వీలు లేదని కోర్టు పేర్కొంది.

  • Loading...

More Telugu News