: ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
ఆరో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పలు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, విద్యాబాలన్, సోనమ్ కపూర్ లు ముంబయిలోని బాంద్రాలో ఓటు వేశారు. అటు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఆల్వార్ లో... పారిశ్రామికవేత్త అనిల్ అంబాని, నటుడు రాహుల్ బోస్ ముంబయ్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అస్సాంలోని గౌహతిలో, ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ లోని సఫాయ్ లో ఓటు వేశారు.