: నేను రేపు కోర్టులో లొంగిపోతా: బీజేపీ నేత గిరిరాజ్ సింగ్


తాను ఎక్కడా దాక్కోలేదని, పోలీసులు అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీహార్ కు చెందిన బీజేపీ నేత, నవాడా లోక్ సభ అభ్యర్థి గిరిరాజ్ సింగ్ చెప్పారు. రేపు కోర్టులో తాను లొంగిపోతున్నట్లు ఆయన వెల్లడించారు. అందరి కంటే ముందు నరేంద్ర మోడీకి మద్దతు పలికింది తానేనని ఆయన అన్నారు. తాను ఒంటరి పోరాటం చేస్తున్నానని, దేవుడు తన వెంటే ఉన్నాడని గిరిరాజ్ వ్యాఖ్యానించారు.

నరేంద్ర మోడీని వ్యతిరేకించే వారు పాకిస్థాన్ కు వెళ్లాల్సిందేనంటూ జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఎన్నికల కమిషన్ ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. బొకారో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

  • Loading...

More Telugu News