: చంద్రబాబు నుంచి మేం పాఠాలు నేర్వాలా?: సీఎం


విపక్షాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు. విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆయన ఈరోజు నెల్లూరు జిల్లాలో జరిగిన ఇందిరమ్మ బాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల సంక్షేమం విషయంలో తాము చంద్రబాబు, బీజేపీలను చూసి నేర్చుకోవాలా? అని ప్రశ్నించారు.

తొమ్మిదేళ్ళ పాలనలో బాబు బీసీల కోసం ఖర్చు పెట్టింది రూ. 1025 కోట్లే అనీ, తాము అంతకు రెట్టింపు నిధులను కేటాయించామని సీఎం చెప్పారు. ప్రతి అంశంలోనూ పేదలకు ఇబ్బంది కలగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతులకు ఈ ఏడాది రూ. 7 లక్షల కోట్ల మేర రుణాలు అందించనున్నట్టు వెల్లడించారు.

కాగా, రెండేళ్ళలో 33 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. రూ. 1.85 లక్షల కోట్లతో భారీ ఎత్తున తలపెట్టిన జలయజ్ఞం  ప్రాజెక్టులో ఇప్పటివరకు రూ. 85 వేల కోట్లు ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు. మొత్తం 86 ప్రాజెక్టుల్లో 22 పూర్తి చేశామని చెప్పారు. 

  • Loading...

More Telugu News