: కేవీపీ అరెస్టుకు రంగం సిద్ధం?


టైటానియం కుంభకోణం కేసులో వైఎస్ ఆత్మ కేవీపీ అరెస్టుకు రంగం సిద్ధమైందా? అవుననే అంటోంది జాతీయ మీడియా. రాష్ట్రంలోని టైటానియం ఖనిజాన్ని విదేశీ సంస్థలకు అప్పనంగా కట్టబెట్టిన కుంభకోణంలో కేవీపీ కీలక నిందితుడంటూ అమెరికాలోని షికాగో ఫెడరల్ కోర్టు అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఓ అంతర్జాతీయ కుంభకోణానికి తమ భూభాగాన్ని వాడుకున్నారన్న ఆరోపణలతో కేవీపీ సహా మరో ఐదు మందిపై షికాగో ఫెడరల్ కోర్టు అభయోగాలు మోపింది. ఈ నేపథ్యంలో కేవీపీపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. ఇప్పటికే అమెరికాకు చెందిన అధికారులు (ఎఫ్ బీఐ) ఢిల్లీ చేరుకున్నారని... సీబీఐ అధికారులతో చర్చలు జరుపుతున్నారని పీటీఐ తెలిపింది. భారతీయ చట్టాల పరిధిలోనే కేవీపీని అరెస్ట్ చేసే యోచనలో అమెరికా అధికారులు ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News