: సీమాంధ్రలో 42 రకాల పరిశ్రమలొస్తాయి: ప్రకాశ్ జవదేకర్
హైదరాబాదులోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రలో 42 రకాల పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని, పరిశ్రమల వల్ల లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని ఆయన అన్నారు. ఉక్కు, సిమెంటు, ఇతర పరిశ్రమల ద్వారా జీడీపీ వృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు. కృష్ణా, గోదావరి నదుల్లో వృథా అవుతున్న 3 వేల టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే బృహత్తర పథకాన్ని రూపొందించినట్లు ఆయన చెప్పారు.
ఈ నెల 27, 28 తేదీల్లో నరేంద్ర మోడీ మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నట్లు జవదేకర్ చెప్పారు. ఒకేరోజు నాలుగు బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.