: కడప శాసనసభ స్థానంలో కిరణ్ పార్టీకి ఎదురుదెబ్బ
కడప శాసనసభ స్థానంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ జై సమైక్యాంధ్రకు ఎదురు దెబ్బ తగిలింది. ఇక్కడి నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సింగిరెడ్డి మల్లారెడ్డి ఈ రోజు తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. కాగా, అటు విశాఖ జిల్లా నర్సీపట్నంలో కాంగ్రెస్ అభ్యర్థి కె.అప్పలనాయుడు పోటీ నుంచి తప్పుకున్నారు.