: మాకిచ్చిన స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను తప్పించండి: సీపీఐ
పొత్తు నేపథ్యంలో తమకిచ్చిన స్థానాల్లో నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థులను తప్పించాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కోరారు. మహేశ్వరం, మునుగోడు, ఎల్లంపల్లిలో సీపీఐ అభ్యర్థులనే పోటీలో ఉంచాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. ఈ రోజు హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నరేంద్ర మోడీని ప్రధాని చేయడానికి కార్పొరేట్ సంస్థలు వేలకోట్లు ఖర్చు పెడుతున్నాయన్నారు. టీవీ ఛానల్స్ లో తప్ప మోడీ హవా ఎక్కడా లేదని సురవరం చెప్పుకొచ్చారు.