: పవన్ మద్దతుతో మల్లారెడ్డి సంతోషం
మల్కాజిగిరిలో లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణకు కాకుండా టీడీపీ-బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి అయిన తనకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు పలకడంతో మల్లారెడ్డి తెగ సంతోషపడుతున్నారు. ఈ ఎన్నికల్లో పవన్ తనకు సపోర్టు చేయడం వల్ల విజయం ఖాయమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, నిన్నటి వరకు జేపీకి తన స్వచ్ఛంద మద్దతిస్తున్నట్లు పవన్ చెబుతూ వచ్చారు. కానీ, అనూహ్యంగా హైదరాబాదు బహిరంగసభ వేదికపై మోడీ మల్లారెడ్డి పేరు ప్రకటించడంతో ఆయన షాక్ అయ్యారు.