: పొత్తు లేకున్నా... గెలిచి తీరుతాం: వైఎస్సార్సీపీ నేత ఉమ్మారెడ్డి
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ ఆశయాలను జగన్ మాత్రమే నెరవేర్చగలరని ఆయన చెప్పారు. విజయవాడలో ఇవాళ ఉమ్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రాజ్యసభ సీటును కార్పొరేట్లకు అమ్ముకున్న నేత చంద్రబాబు అని విమర్శించారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలకు, చంద్రబాబు సిద్ధాంతాలకు పొంతన లేదన్నారు. టీడీపీ-బీజేపీలది విభజన కూటమి అని ఆయన ఆరోపించారు.