: గిర్ అడవుల్లో ఒకే ఒక్క ఓటరు... అతడి కోసం పోలింగ్ కేంద్రం


మన ప్రజాస్వామ్యం అడవుల్లోకీ చొచ్చుకుపోతోంది... ఆశ్చర్యపోకండి! గుజరాత్ లోని గిర్ అడవులు ఆసియా సింహాలకు నెలవు. ఈ అడవి మధ్యలో ఒక ఆలయం ఉంది. ఆ ఆలయంలో స్వామి సేవ కోసం ఓ పూజారి అక్కడే సెటిలైపోయారు. ఆయన పేరు మహంత్ భరత్ దాస్ దర్శన్ దాస్. ఆయనకు ఓటు హక్కు ఉంది. గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఆయన ఓటేశారు. మరి ఈసారి ఏప్రిల్ 30న జునాగఢ్ పార్లమెంట్ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. ఈ ఒక్క ఓటరు కోసం పోలింగ్ సిబ్బంది ఆ రోజు అడవి బాట పట్టనున్నారు. ఎందుకంటే, ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏ ఓటరు కూడా రెండు కిలోమీటర్ల కంటే దూరం వెళ్లకూడదనేది ఎన్నికల సంఘం నిబంధన. దీంతో ఆ ఒక్క ఓటరు కోసం ఎన్నికల సిబ్బందే 35 కిలోమీటర్ల పాటు అడవుల్లో ప్రయాణం చేయనున్నారు.

  • Loading...

More Telugu News