: ముస్లింలు మతోన్మాదులుగా మారాలి: ఇల్మి విద్వేష వ్యాఖ్యలు


ఆమ్ ఆద్మీ పార్టీ నేత షాజియా ఇల్మి చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముస్లింలు లౌకికవాదులుగా ఉన్నారని, వారు తొలిసారిగా మతోన్మాదులుగా మారి తమ వారికి ఓటేయాల్సిన అసవరం ఉందని ఆమె అన్నారు. ఈ మేరకు ఇటీవల ముంబైలో తనను కలసిన ముస్లింలకు ఇల్మి చేసిన సూచనలకు సంబంధించిన 79 సెకండ్ల నిడివిగల వీడియో వెలుగు చూడడంతో మంటలు పుట్టిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఇలాంటి వ్యాఖ్యలకు పార్టీలో చోటు లేదని స్పష్టం చేసింది. వీటిని తాము ఆమోదించమని ప్రకటించింది. ఇల్మి ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News