: హిందూపురం మా కంచుకోట... భారీ ఆధిక్యంతో గెలుస్తా: బాలకృష్ణ


టీడీపీలో ఏకైక స్టార్ క్యాంపెయినర్ అయిన బాలకృష్ణ రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ మేరకు విజయనగరంలో కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రెండు ప్రాంతాల అభివృద్ధే టీడీపీ లక్ష్యమని చెప్పారు. చంద్రబాబు అందరినీ ఏకతాటిపై తీసుకెళ్లే నాయకుడన్నారు. తనకు పదవుల మీద వ్యామోహం లేదని, బాబే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను పోటీ చేస్తున్న హిందూపురం తమ పార్టీ కంచుకోటని, భారీ మెజార్టీతో గెలుస్తానని బాలయ్య ధీమా వ్యక్తం చేశారు. తన సోదరి పురందేశ్వరి పోటీ చేస్తున్న రాజంపేటకు తాను వెళ్లడం లేదని... తన రూట్ మ్యాప్ లో రాజంపేట లేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News