: జడ్జీలు తీర్పులను అమ్ముకుంటున్నారు: కరుణ ఘాటైన వ్యాఖ్యలు


నిన్నగాక మొన్న న్యాయవాదులు, న్యాయస్థానాలపై నోరు పారేసుకున్న డీఎంకే అధినేత కరుణానిధి... ఈసారి ఏకంగా న్యాయమూర్తులను టార్గెట్ చేశారు. ఈ దేశంలో న్యాయం కోసం న్యాయస్థానాలకు వెళ్లేవారికి న్యాయం లభించడం లేదంటూ విమర్శించారు. న్యాయమూర్తులు వెలువరించే ఒక్కో తీర్పుకు ఒక్కో రేటు ఉంటుందంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ ను కూడా ఉతికి ఆరేశారు. కోడ్ ఉల్లంఘన, ఓటర్లకు నగదు పంపిణీలాంటి వ్యవహారాల్లో ఎన్నికల సంఘం తీరు అనుమానించే విధంగా ఉందని... ఒక్కో కేసులో ఒక్కోలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం కరుణ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

  • Loading...

More Telugu News