: బిగ్ బికి వెరీ బిగ్ సన్మానం
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు మరో విశిష్ట గౌరవం దక్కనుంది. త్వరలో జరగనున్న మెల్ బోర్న్ చిత్రోత్సవంలో, భారతీయ సినిమాకు ప్రపంచ ప్రతినిధిగా ప్రసిద్ధిగాంచిన బిగ్ బిని ఘనంగా సత్కరించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. జూలై 25 నుంచి ప్రారంభమయ్యే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో అమితాబ్ సినీ ప్రస్థానంపై ఓ 'స్పెషల్' కూడా ప్రదర్శితం కానుంది.
ఈ విషయమై అమితాబ్ స్పందించారు. ప్రస్తుతం తాను నటిస్తున్న 'సత్యాగ్రహ' చిత్రం షూటింగ్ ఏప్రిల్ నెలాఖరుకల్లా పూర్తవుతుందని, అనంతరం న్యూయార్క్ వెళ్ళి అక్కడ 'గ్రేట్ గాట్స్ బై' అనే ఆంగ్ల చిత్రంలో నటించాల్సి ఉందని తెలిపారు. ఆ తర్వాత మెల్ బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరవుతానని ఆయన చెప్పారు.