: కాంగ్రెస్ పార్టీది మోసపూరిత మేనిఫెస్టో: మోడీ
ఎన్డీఏ అధికారంలోకి రాగానే విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ చెప్పారు. దేశంలో భద్రత కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల కాలంలో దేశాన్ని, రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నారని తెలిపారు. ఈ దేశాన్ని ఇలాగే వదిలేద్దామా? లేక, అభివృద్ధి చెందాలని కలలు కందామా? అని ప్రశ్నించారు. దేశ ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పాలంటే బలమైన ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరముందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసపూరిత ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిందని అన్నారు. 10 కోట్ల ఉద్యోగాలంటూ ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని మోడీ ఆరోపించారు.