: హైదరాబాదులో నాకు అక్రమాస్తులు లేవు: కేసీఆర్
హైదరాబాదులో తనకు అక్రమాస్తులు లేవని... ఈ వ్యవహారంపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఈ రోజు వరంగల్ జిల్లా భూపాలపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను ఢిల్లీలో తాకట్టు పెట్టమని... దేశం గర్వపడేలా తెలంగాణను పునర్నిర్మిస్తామని చెప్పారు. ఇతర పార్టీలను విలీనం చేసుకోవడమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడరాదని హెచ్చరించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక భూకబ్జాదారుల భరతం పడతామని చెప్పారు.