: నల్ల బ్యాడ్జీలు ధరించి.. లాంతరు చేతపట్టిన చంద్రబాబు!


విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కాకినాడలో నిర్వహిస్తున్న ఒక రోజు దీక్ష నేటి ఉదయం ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న బాబు ఆ కార్యక్రమానికి తాత్కాలిక విరామం ప్రకటించారు. రాష్ట్రం విద్యుత్ సమస్యతో తీవ్ర ఇక్కట్ల పాలవుతున్న తరుణంలో ప్రజలపై ఛార్జీల భారం మోపిన సర్కారు వైఖరిని వ్యతిరేకిస్తూ ఆయన నల్ల బ్యాడ్జీలు ధరించి, లాంతరు చేతపట్టారు. 

ఇక్కడి ఆనందభారతి మైదానం నుంచి పెద్ద ఎత్తున ప్రజాసందోహం వెంటరాగా,  బాబు జేఎన్టీయూ(కె)  సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద దీక్షా వేదికను చేరుకున్నారు. ఈ దీక్షలో బాబుతో పాటు యనమల తదితర రాష్ట్రస్థాయి నేతలు పాల్గొంటున్నారు. ఈ దీక్ష సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. 

  • Loading...

More Telugu News