: కులం పేరుతో శ్రవణ్ కు సీటు నిరాకరించారు: పవన్ కల్యాణ్
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నిజామాబాద్ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పరోక్ష విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీఆర్ఎస్ లో ఉండి తనదైన కృషి చేసిన దాసోజు శ్రవణ్ కు కులం పేరుతో టికెట్ ఇవ్వడానికి నిరాకరించారని చెప్పారు. 'నీ కులానికి పట్టుమని పది ఓట్లు కూడా లేవు' అంటూ శ్రవణ్ కు సీటు ఇవ్వలేదని వివరించారు. కులమే అనుకుంటే ఒక కుటుంబానికి అన్ని సీట్లు అవసరమా? అని కేసీఆర్ ను ప్రశ్నించారు. పోరాటం చేసే సత్తా ఉందా? లేదా? అన్నదే చూడాలని, కులం కాదన్నారు. కొడుకు, కూతురు, అల్లుడు, మేనల్లుడు ఇదేనా రాజకీయమని అడిగారు. తాను మొన్నటి వరకు ప్రత్యక్ష రాజకీయల్లో లేనని, అసలు తానడిగితే ఓట్లేస్తారా? అన్నది కూడా తనకు తెలియదని చెప్పారు. మూడు పార్టీలు, ముగ్గురు అభ్యర్థులు ఇదే నిజామాబాద్ లోక్ సభలో అసలైన పోటీ అని పేర్కొన్నారు.